శంషాబాద్ (Shamshabad) విమానశ్రయంలో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇక నుంచి రోబోటిక్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఎయిర్పోర్టు(Airport)లో అడుగుపెట్టిన క్షణం నుంచి విమానంలో కూర్చునేంత వరకూ ప్రయాణికులకు అవసరమైన సేవలను రోబోలు అందించనున్నాయి. పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు రోబోటిక్ పరిజ్ఞానం(Robotic knowledge)తో పనిచేసే పరికరాలు, యంత్రాలను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం జీఎంఆర్ (GMR) ఇన్నోవెక్స్ పేరుతో 6 నెలల క్రితం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కేంద్రంలో ప్రస్తుతం రోబోలు, యంత్రాలు, పరికరాలు తయారు చేసేందుకు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆవిష్కరణలపై ఐఐటీ-బాంబే, పెప్పర్మెంట్, సైన్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఐఐటీ-బాంబే, పెప్పర్మెంట్ సంస్థ(Pepperment Company)లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలుస్తుంది! ఇదే సమయంలో రోబోటిక్ ఉత్పత్తులను రూపొందించే స్టార్టప్ కంపెనీలకూ ప్రోత్సాహం అందించనున్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలో అన్నీ అనుకున్నట్లుగా సాగితే వచ్చే ఏడాది తొలి ఆరునెలలోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రోబోల సేవలు అందుబాటులోకి వస్తాయి!ఈ సర్వీస్ కోసం ఇప్పటికే రోబోటిక్ ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకొచ్చిన జీఎంఆర్… పలు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు రూపొందిస్తున్న ఆవిష్కరణలను ఎంకరేజ్ చేస్తూ, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలనూ కల్పిస్తున్నారని తెలుస్తుంది. ఇలా అనుభవం ఉన్న వ్యక్తులు, స్టార్టప్ కంపెనీల సౌజన్యంతో త్వరలో రోబోల సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.కాగా.. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కృత్రిమ మేధ (AI)తో పనిచేసే రోబోలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అవి ప్రయాణికులకు విమానాల రాకపోకలు, ఎయిర్ లైన్స్ (Airlines)సమాచారాన్ని అందిస్తున్నాయి.