ప్రముఖ యాంకర్ సుమ (Anchor suma) మీడియాను క్షమాపణలు కోరారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘పాత్రికేయ (Media) మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నేనొక ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘లీలమ్మో’ పాట (Leelammo’ song) ఈవెంట్‌కి యాంకర్‌గా వ్యవహరించిన సుమ ఓ సందర్భంలో ‘మీడియావారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు’ అని ఆమె అన్నారు.
అక్కడే ఉన్న ఓ మీడియా ప్రతినిధి ఈ వ్యాఖ్యలను ఖండించారు. అలా అనొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చాలాకాలంగా ఉన్న చనువుతోనే ఈ వ్యాఖ్యలు చేశానని, క్షమించాలని అదే వేదిక (Stage)పై ఆమె కోరిన విషయం తెలిసిందే. ‘మీరు స్నాక్స్‌ను స్నాక్స్‌లానే తిన్నారు ఓకేనా?’ అని సుమ అడగ్గా.. ‘ఇదే వద్దనేది. మీ యాంకరింగ్ (Anchoring) అందరికీ ఇష్టమేగానీ మీడియా విషయంలో ఇలాంటివి వద్దు’ అని సదరు విలేకరి ఘాటుగా సమాధానమిచ్చారు. అప్పుడే వేదికపై క్షమాపణలు కోరిన సుమ తాజాగా వీడియో విడుదల చేశారు.