అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఇంకా తెలుగు ఇడస్ట్రీలోకి అడుగుపెట్టలేదు కానీ అమ్మడి క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. గ్లామర్ ట్రీట్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీస్తోంది.
Janhvi Kapoor: జాన్వీ అంటేనే సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. సినిమాల కంటే సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేసే అందాల విందు మామూలుగా ఉండదు. ఎంత సేపు చూసిన.. జాన్వీ అందం తనవి తీరదు అనేలా ఉంటుంది. రోజుకో ఫోటో షూట్‌తో రెచ్చిపోవడం జాన్వీ స్టైల్. అది కూడా ఓవర్ క్లీవెజ్ చేస్తుంటుంది. బికినీ ట్రీట్, సముద్రంలో తడిచిన అందాలు, ఎద అందాలను చూపిస్తు కుర్రాళ్ల ఫాలోయింగ్‌ను రోజు రోజుకి పెంచుకుంటోంది. ఇక వర్కౌట్ చేసి జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడే పొట్టి బట్టల్లో జాన్వీ చేసే స్కిన్ షో మామూలుగా ఉండదు.
ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో జాన్వీ తర్వాతే ఎవ్వరైనా. కానీ ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ బ్రేక్ కూడా అందుకోలేదు జాన్వీ పాప. అయినా అమ్మడికి భారీ డిమాండ్ ఉంది. బాలీవుడ్లో పెద్దగా పట్టించుకోకపోయినా.. సౌత్‌లో మాత్రం ఆమె ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో సౌత్‌లో అడుగుపెట్టబోతోంది జాన్వీ కపూర్. ఈ సినిమాలో తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్ తాజాగా అహ్మదాబాద్‌లో నిర్వహించిన 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024 ఈవెంట్లో అదిరిపోయే అవుట్ ఫిట్లలో అదరగొట్టేసింది. అలాగే వేదికపై అద్భుతమైన డాన్స్ పెర్ఫామెన్స్‌తో దుమ్ముదులిపేసింది. మాస్ స్టెప్పులతో స్టేజీని ఉర్రూతలూగించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టేజీ పైనే ఇలా ఉంటే, ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్‌తో డ్యాన్స్ అంటే మామూలుగా ఉండదనే చెప్పాలి.