»Pakistan Former Prime Minister Imran Khan Sentenced To 10 Years In Prison
Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్లు జైలు శిక్ష
అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు సైఫర్ కేసులో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
Pakistan: మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు సైఫర్ కేసులో గట్టి దెబ్బ తగిలింది. అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో పాకిస్థాన్ కోర్టు ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే అతని సన్నిహితుడు షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడినట్లు తెలుస్తోంది. అమెరికాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం మార్చి 2022లో కీలక అంశాన్ని పాక్‌కు చేరవేసినట్లు సమాచారం. ఇమ్రాన్ ప్రధానిగా దిగిపోయేముందు నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇవేనంటూ కొన్ని పత్రాలు చేతితో పట్టుకుని చూపించారు. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లు తెలిపారు. దీంతో అఫీషియల్ సీక్రెట్స్ యాక్టును ఉల్లంఘించారనే అభియోగాలతో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీలపై కేసు నమోదయ్యింది. 2022లో ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అతను ప్రధాని మంత్రి పదవి వీడాల్సి వచ్చింది.