పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ.. స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకోలేకపోయింది అమ్మడు. ప్రస్తుతానికి సినిమాలకు దూరంగానే ఉన్న ఆ బ్యూటీ తాజాగా నిశ్చితార్థం చేసుకుంది.
Kriti Kharbanda: తెలుగులో కాస్త పద్దతిగా కనిపించిన ముద్దుగుమ్మల్లో కృతి కర్బంద కూడా ఒకరు. తెలుగులో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది కృతి. అక్కినేని సుమంత్ హీరోగా నటించిన బోణీ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ.. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తీన్మార్’ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అలాగే రామ్‌తో ఒంగోలు గిత్త, రామ్ చరణ్ నటించిన బ్రూస్లీలో కీలక పాత్రలో నటించింది. అయినా కూడా కృతి కెరీర్ టర్న్ అవుతుంది అనుకుంటే అది కలగానే మిగిలిపోయింది.
బాలీవుడ్లో గట్టిగానే ట్రై చేసింది. అక్కడ కూడా అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. అరకొర అవకాశాలతోనే నెట్టుకొస్తుంది. అయితే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎంగేజ్మెంట్ చేసుకుంది. గత కొంతకాలంగా పుల్కిత్ సామ్రాట్‌తో కృతి కర్బంద ప్రేమలో ఉందనే వార్త వినిపిస్తోంది. ఈ ఇద్దరు వీరే ది వెడ్డింగ్, పాగల్ పంతీ, తైష్ వంటి సినిమాల్లో కలిసి నటించారు. మొదటి సినిమా నుంచే ఈ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు.
గతంలో ఒకసారి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోని విడిపోయిన పుల్కిత్, గత కొన్నాళ్లుగా కృతితోనే ఉంటున్నాడు. ఫైనల్‌గా కృతి, సామ్రాట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీళ్ల నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి పీఠలెక్కబోతున్నట్టుగా సమాచారం. మరి కృతి పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవుతుందా? లేదా కొనసాతుందా? అనేది వేచి చూడాల్సిందే.