EC declared Bollywood actor Rajkumar Rao as National Icon
Bollywood: తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగున్న సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం(ECI) కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు(Rajkumar Rao)ను నేషనల్ ఐకాన్‌గా నియమించనుంది. ఢిల్లీలోని రంగ్‌భవన్ ఆడిటోరియంలో గురువారం ఉదయం ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రకటిస్తారు.
రాజ్‌కుమార్ రావు 2017లో న్యూటన్ అనే హిందీ చిత్రంతో ఆరంగేట్రం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వ అధికారి పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా హిందీలో ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం క్యాటగిరీలో భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించి, ఎక్కవ మంది ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభావితం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రముఖ వ్యక్తులను నేషనల్ ఐకాన్లుగా నియమిస్తుంటుంది. వీరు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీతో కలిసి పనిచేస్తారు. గతంలో ఈసీ నేషనల్ ఐకాన్లుగా సినీ స్టార్లు పంకజ్ త్రిపాఠి, అమీర్ ఖాన్(Aamir Khan)తో పాటు క్రీడా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar), ఎంఎస్ ధోనీ, మేరీ కోమ్‌ను ఐకాన్లుగా వ్యవహరించారు.