»Bharat Bharat Instead Of India Should Be Like This In School Books
Bharat: ఇండియాకి బదులుగా భారత్.. స్కూల్పుస్తకాల్లో ఇలానే ఉండాలి
ఇటీవల జరిగిన జీ20 సదస్సులో ఇండియా నేమ్‌ప్లేట్ ఉన్న స్థానంలో భారత్ అని రాసి ఉంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా పాఠ్యపుస్తకాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చమని ఎన్సీఈఆర్టీ(NCERT) కమిటీ సిఫార్సు చేసింది.
Bharat: ఇండియా పేరును భారత్(Bharat)గా మార్చేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన జీ20 సదస్సులో ఇండియా నేమ్‌ప్లేట్ ఉన్న స్థానంలో భారత్ అని రాసి ఉంది. దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లోనూ ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కూల్ పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్‌ను చేర్చాలని ఎన్సీఈఆర్టీ(NCERT) కమిటీ సిఫార్సు చేసింది. దీంతోపాటు పుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘సంప్రదాయిక చరిత్ర’ను ప్రవేశపెట్టాలని, అన్ని సబ్జెక్టుల్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్లు కమిటీ ఛైర్మన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ సభ్యుడు సీఐ ఐజాక్ వెల్లడించారు. ఇంకా దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ(NCERT) అధికారులు తెలిపారు.
పాఠ్యపుస్తకాల్లో మనవాళ్లు సాధించిన అపజయాలే ఉన్నాయి. మొఘలులపై, సుల్తానులపై సాధించిన విజయాలు గురించి లేవు. వీటిని హైలెట్ చేస్తూ పాఠ్యపుస్తకాలను రూపొందించాలని ప్రతిపాదించినట్లు ఐజాక్ తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకు తగిన రీతిలో స్కూల్ బుక్స్‌ను రూపొందించేందుకు ఎన్సీఈఆర్టీ ప్రయత్నాలు చేస్తోంది. పాఠ్యపుస్తకాల సిలబస్ తయారీ కోసం ఇటీవల 19 మందితో కలిసి ‘నేషనల్ సిలబస్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్’ అనే కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.