Revanth Reddy said was a part of the conspiracy to attack Kotha Prabhakar Reddy and Guvvala Balaraju
Telangana: తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ మొదటి రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ నీడ లేకుండా వ్యవహరిస్తోంది. అధికారం చేపట్టిన రెండో రోజే తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన ఏడుగురు సలహాదారుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. సోమేశ్ కుమార్, రాజీవ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, అనురాగ్ శర్మ, చెన్నమనేని రమేష్, ఆర్ శోభ తమ పదవులను కోల్పోనున్నారు.
7వ తేదీన ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేతలెవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఉమ్మడి జిల్లాలోని మంచర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నలుగురిలో ముగ్గురు సీనియర్ నేతలు ఉన్నారని, వీరిలో ఇద్దరికి కచ్చితంగా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం సాగింది. ముగ్గురు సీనియర్ నేతల్లో కనీసం ఇద్దరికి వినోద్, వివేక్, ప్రేంసాగర్ రావులకు కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని, చివరకు చేతులెత్తేయడం హాట్ టాపిక్ గా మారింది.