»Protest To Brs Mla Villagers Prevented Him From Coming To Our Village
BRS ఎమ్మెల్యేకు నిరసన సెగ..మా ఊరికి రావొద్దు అడ్డుకున్న గ్రామస్తులు
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పరిధిలోని వట్టినాగులపల్లిలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు వెళ్లగా.. ప్రచారం చేయడానికి వీళ్లేదంటూ అడ్డు తగిలారు.
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ (Rajendranagar) వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ తగిలింది. తమ గ్రామంలో ప్రచారం చేయవద్దంటూ గ్రామస్తులు నేతలను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్(MLA Prakash Goud)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇళ్లు, దళిత బంధు ఎమ్మెల్యే వర్గీయులకే ఇచ్చారంటూ ఆరోపించారు. వట్టినాగులపల్లి(Vattinagulapally)లో విప్రోలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయలేదని.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ప్రచారానికి వస్తున్నారని బీఆర్ఎస్ నాయకుల (BRS Ledars)ను స్థానిక ప్రజలు నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్, దళితబంధు రాలేదని బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే వర్గీయులకే కేటాయించారని బీఆర్ఎస్ నాయకులను విమర్శించారు. మా గ్రామంలో పనులు మేమే చేసుకుంటాం. ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా(Against)నినాదాలు చేశారు. ప్రచారం చేయడానికి వీళ్లేదంటూ అడ్డు తగిలారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మా గ్రామంలో పనులు మేమే చేసుకుంటాం. ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు బహిరంగంగానే ఆగ్రహానికి గురవుతున్నారు.ఎన్నికల ప్రచారన్నికి వచ్చిన ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నారు