»A Police Case Has Been Registered Against Hero Nagarjunas Sister Nagasusheela
Nagasusheela: హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై పోలీస్ కేసు నమోదు
నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. తనను జైలుపాలు చేసైనా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకోవడానికి నాగసుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు.
Nagasusheela: ప్రముఖ తెలుగు నటుడు నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీలతో పాటు మరికొందరు దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నాగసుశీల, శ్రీనివాస్ కలిసి గతంలో పలు చిత్రాలను నిర్మించడంతో పాటు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వీరి మధ్య కొన్నేళ్లుగా భూవివాదం ఉంది. శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్, నాగసుశీల మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే తనకు తెలియకుండానే శ్రీనివాస్ తన భూములను విక్రయించాడని గతంలో పంజాగుట్ట పోలీసులకు నాగసుశీల ఫిర్యాదు చేశారు. మరోవైపు తనను జైలుపాలు చేసైనా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకోవడానికి తనపై నాగసుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల తనయుడు సుశాంత్‌తో నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామన్నారు. ఈ వివాదాల నేపథ్యంలో నాగసుశీలపై శ్రీనివాస్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది.
ఇటివల ఓ యువకుడు అమెరికా నుంచి వచ్చాడు. హైదరాబాద్‌లో అత్యుత్సాహం ప్రదర్శించాడు. చివరకు 20 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. అయితే ఈ ఘటనలో పలువురు తప్పు పోలీసులదేనని చెబుతుండగా..మరికొందరు మాత్రం ఆ యువకుడిదే మిస్టెక్ అని అంటున్నారు. అయితే అసలు ఏ జరిగింది? ఆ కేసు వివరాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.