»Police Case Against Mythri Movie Makers Head Naveen Yarneni In Phone Tapping Case
Phone tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ తెలుగు నిర్మాత
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వివాధంలో తాజాగా తెలుగు నిర్మాత మైత్రీ మూవీస్ మేకర్స్ అధినేతలో ఒకరైన యర్నేని నవీన్ పేరు వినిపించింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Police case against Mythri Movie Makers head Naveen Yarneni in phone tapping case
Phone tapping: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ వివాధంలో తాజగా ప్రముఖ నిర్మాత పేరు బయటకొచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు మైత్రీ మూవీస్ అధినేతలో ఒకరైన నవీన్ యర్నేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత రెండు నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ నాయకుల నుంచి వ్యాపారవేత్తులు, సినీ ప్రముఖులు ఈ వ్యవహారంలో ఉన్నారు. బాధితులు బయటకు వచ్చి ఫిర్యాదులు చేయడంతో ఒక్కొక్కరిగా అందరూ బయటకు వస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్ఆర్ఐ చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి, గతంలో తనను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. బలవంతంగా తన షేర్లను రాయించుకున్నారని, ఇందులో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యర్నేని కూడా ఉన్నారని కేసు పెట్టారు.
వేణుమాధవ్ ప్రారంభించిన క్రియా హెల్త్ కేర్ కంపెనీ వాటాలను బలవంతంగా మార్పించుకున్నారని ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు, ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై మల్లిఖార్జున రావుతోపాటు తన సంస్థలోని నలుగురు డైరక్టర్లు కూడా లబ్ది పొందారని ఆరోపించారు. కాగా, వేణుమాధవ్ ఫిర్యాదుతో సంస్థ ఎండీ రాజశేఖర్ తలసిల, డైరక్టర్లు.. గోపాలకృష్ణ సూరెడ్డి, నిర్మాత నవీన్ యర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచనేని పూర్ణచంద్రరావులను నిందుతులుగా చేర్చి, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.