ఎన్నికల సమయంలో తమిళనాడులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలో కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ రాత్రి వాహనాల తనిఖీ చేపట్టి స్వాధీనం చేసుకున్నారు.
Tamil Nadu: ఎన్నికల సమయంలో తమిళనాడులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలో కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను సోదా చేయగా.. ఒక లారీలో 1025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీపంలోని మన్నూర్లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే 400 కిలోల బంగారానికి ఆధారాలు ఉన్నాయని.. మిగిలిన దానికి ఆధారాలు లేవని తెలిసింది. వెంటనే చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులను సంప్రదించారు. వీటి మొత్తం విలువ రూ.900 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.