»Revanth Reddy Reacts On Phone Tapping And Composition Of Telangana State Anthem
Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్, తెలంగాణ రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నంపై స్పందించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర గీతం చర్చపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజముద్రలో రాచరికపోకడలు ఉండవని చెప్పారు.
Revanth Reddy reacts on phone tapping and composition of Telangana state anthem
Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ విచారణలో తన ప్రమేయం లేదని తెలిపారు. అధికారం మారిన తర్వాత సెక్రటేరియట్లో కొన్ని వస్తువులు మాయమయ్యాయన్నారు. దానికి ఎవరు బాధ్యులు ఎవరు తేల్చే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చిందన్నారు.
ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఓ చర్చపై ఆయన స్పందించారు. రాష్ట్ర గీతాన్ని అందెశ్రీ రాస్తున్నారు అని, ఆయన ఎవరితోనైనా సంగీతం చేపించుకోవచ్చని చెప్పారు. అలాగే రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు ఉండవని అన్నారు. ముందునుంచి చెప్పినట్లు రాజముద్రలో రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుందన్నారు. సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా ఈ చిహ్నం రూపొందుతుందని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కరెంట్ కోతల ఆరోపణలు రాష్ట్రంలో లేవని అన్నారు.