తెలంగాణలోని ప్రజాభవన్‌లో బాంబు ఉందంటూ, పదినిమిషాల్లో పేలుతుందని ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చేప్పాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Praja Bhavan: హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అక్కడ బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. మరో పది నిమిషాల్లో పేలుతుందని హెచ్చరించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రజా భవన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రజాభవన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. భవనం మొత్తం పోలసులు ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు ఎర్పాటు చేశారు. భవనం అణువణువునా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ సైతం రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.
ఆగంతకుడు చెప్పినట్లు పది నిమిషాల్లో బాంబు అనవాళ్లు కనపడలేదు. అయినా సరే ఆఫీసర్లు మాత్రం చాలా సీరియస్‌గా వెతుకుతున్నారు. ఇంకా సెర్చింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్య ఇలాంటి కాల్స్ ఎక్కువయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలోని ప్రముఖ ప్రాంతాల్లో బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈ కాల్స్ వెనుకాల ఓ ముఠా ఉందని పోలీసలు భావిస్తున్నారు. దీనిపై లోతుగా విచారిస్తున్నారు.