»Responding To The Phone Tapping Incident Ktr Revealed That He Is Not Related To Any Heroine
KTR: నాకు ఏ హీరోయిన్‌తో సంబంధం లేదు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కేటీఆర్ మండిపడ్డారు. తనకు ఏ హీరోయిన్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇకపై ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Responding to the phone tapping incident, KTR revealed that he is not related to any heroine
KTR: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్. గత కొన్ని రోజులుగా రాజకీయాలను కుదిపేస్తోంది. బీఆర్ఎస్(BRS) పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రముఖుల ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్లు అధికారపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh), సమంత(Samantha) పేర్లను తెరపైకి తీసుకొచ్చారు. వీరి ఫోన్లను ట్యాప్ చేశారు. వీరి వ్యక్తిగతమైన విషయాలను విన్నారు అని ఆరోపిస్తున్నారు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం కూడా ఈ వ్యవహారమే అని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణ భవన్ మీడియాతో మాట్లాడిన కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హీరోయిన్లను ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించానని ఓ మంత్రి అన్నారని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. ఇది ఇలాగే కొనాగితే చట్టపరమైన చర్యలు తప్పవు అని పేర్కొన్నారు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడితే మంత్రైనా, సీఎం అయినా తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తన క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఏ హీరోయిన్‌తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదని, ఫోన్ ట్యాపింగ్‌లు చేయాల్సిన పని తనకేంటని అన్నారు.