మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. భూకబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో ఆదిభట్ల పోలీసు స్టేషన్లో ఆయనపై కేసు నమోదయ్యింది.
KCR: మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. భూకబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో ఆదిభట్ల పోలీసు స్టేషన్లో ఆయనపై కేసు నమోదయ్యింది. కేసును కొట్టివేయాలంటూ కన్నారావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. రాజకీయ కక్షలతో చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న పిటిషనర్ వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో కన్నారావు A1గా ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడలో సర్వే నెంబర్ 32/ఆర్ యూయూలో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్ సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు గ్యాంగ్ ప్రయత్నించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ గత నెల 3న ఆదిభట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కన్నారావుతో పాటు మరో 38మందిపై కేసులు నమోదయ్యాయి. 147, 148, 447, 427, 307, 436, 506, r/w149 కింద కేసులు పెట్టారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.