Kodangal MLA Patnam Narender Reddy: కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై (Patnam Narender Reddy) బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లిలో ఓ స్థల విషయంలో కేసు ఫైల్ చేశారు. ఉప్పరపల్లిలో ఫ్రెండ్స్ కాలనీలో ఉండే సామ ఇంద్రాల్ రెడ్డి.. అదే చోట స్థలం కొనుగోలు చేశాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో (Patnam Narender Reddy) పరిచయం అయ్యిందట. ఐలమ్మ, కాలమ్మ, పార్వతమ్మ, మహేశ్, భీమ్, భరత్‌కు చెందిన స్థలాన్ని ఇంద్రపాల్ రెడ్డికి విక్రయించేందుకు ఎమ్మెల్యే.. పలువురు కమీషన్ తీసుకొని మధ్యవర్తితం వహించారని తెలిసింది.
ఆ డబ్బుల విషయంలో ఇంద్రపాల్ రెడ్డికి ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి (Patnam Narender Reddy) తేడా వచ్చింది. డబ్బుల ఇవ్వాలని బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఎమ్మెల్యే అనుచరులు గత ఏడాది జూన్ 22వ తేదీన ఇంటికి వెళ్లి.. ఇంద్రపాల్ లేకపోవడంతో ఆయన భార్యను అసభ్య పదజాలంతో దూషించారట. తర్వాత బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ఎమ్మెల్యే వద్దకు ఇంద్రపాల్ రెడ్డి వచ్చి.. డబ్బు చెల్లించడానికి కొంత సమయం అడిగారట. ఆగ్రహాం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి (Patnam Narender Reddy).. దాడి చేశాడని తెలిసింది. తప్పించుకొని పారిపోతున్న అతని పట్టుకొని.. చంపాలని గన్‌మెన్‌ను ఆదేశించారట ఎమ్మెల్యే.
దాడి జరిగిన ఘటనపై అదే రోజు బంజారాహిల్స్ పోలీసుల వద్దకు బాధితుడు ఇంద్రపాల్ రెడ్డి వెళ్లాడు. పోలీసులు మాత్రం ఫిర్యాదు తీసుకోలేదు. కేసు పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరికీ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy), మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.