అతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 94. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది.
దిగ్గజ వ్యాపారవేత్త ఒబెరాయ్ గ్రూప్ చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్(Oberoi)ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆతిథ్యరంగంలో హోటల్స్ గ్రూప్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దారు. టూరిజం రంగంలోనూ తనదైన ముద్రవేశారు. ఆయన సేవలకుగాను పద్మవిభూషణ్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు (Awards) వరించాయి.ఆయన మరణం ఒబెరాయ్ గ్రూపుతోపాటు భారత్, విదేశీ ఆతిథ్య రంగానికి తీవ్రమైన నష్టమని ప్రకటనలో పేర్కొన్నారు. అంత్యక్రియులు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయని వివరించారు. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫామ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు.పీఆర్ఎస్ ఒబెరాయ్ దూరదృష్టి గల నాయకుడని, అంకితభావం, మక్కువతో ఒబెరాయ్ గ్రూప్, హోటళ్ల(Hotels)ను ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దారని ప్రకటనలో గ్రూపు పేర్కొంది.
ఆయన విస్తరించిన హోటళ్లు భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగాన్ని ప్రభావితం చేస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా పీఆర్ఎస్ ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్తరూపు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్తరూపు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. దేశంలోనే కాదు అనేక దేశాల్లో లగ్జరీ హోటళ్లు నిర్వహిస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. ఒబెరాయ్ హోటల్స్ , రిసార్ట్స్ (Resorts) అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించారు. అలా ఆ సంస్థను అభివృద్ధిలోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఒబెరాయ్ బ్రాండ్ లగ్జరీ హోటళ్లకు కెరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇక ఒబెరాయ్ తన కెరీర్లో అనేక అవార్డులను, ప్రశంసలను అందుకున్నారు. పర్యాటకం, ఆతిథ్యంలో దేశానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఒబెరాయ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు కూడా వరించాయి.