Rain alert for Telugu states ap and telangana november 29th 2023
తమిళనాడు, పుదుచ్చేరిలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.దీంతో ఆ రాష్ట్రంలో కడలూరు, మైలాడుతురై, విల్లుపురం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకంటించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu) తడిసిముద్దవుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి (Heavy Rains) కురుస్తున్నది. పుదుచ్చేరిలో మంళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎగువ వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, తమిళనాడులో తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికి ఈశాన్య రుతుపవనాలే కీలకం. గతవారం వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం (Rainfall) నమోదయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ముందే హాలీడే ఇచ్చింది