Chiranjeevi: ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ.. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. ‘ఇంద్ర’లాంటి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చినా తనను చిరంజీవి ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టలేదని అప్పట్లో చిన్నికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే చిరంజీవిని దుర్భాషలాడుతూ మాట్లాడారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై చిరంజీవికి క్షమాపణలు చెబుతూ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు.
Anna annayya kshaminchu ani Padmavibhushan Chiranjeevi garini apologies adigina writer Chinnikrishna. pic.twitter.com/9CUGEVhb1r
చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసి చాలా సంతోషించా. ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపాను. ఈ భూమ్మీద పుట్టిన అందరూ అనను కానీ కొందరు తప్పులు చేస్తారు. తప్పులు మాట్లాడతారు అన్నది నగ్నసత్యం. నా మీద నమ్మకంతో నన్ను పిలిచి ఇంద్ర సినిమా ఇచ్చిన చిరంజీవిగారిని నాకు బ్యాడ్ టైమ్ నడుస్తున్న సమయంలో పేర్లు చెప్పను కానీ కొందరి ప్రభావం వల్ల అన్నయ్యపై పలు వ్యాఖ్యలు చేశాను. నోటికొచ్చినట్లు మాట్లాడాను. ఇష్యూ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా చిరంజీవిగారికి ఎదుటపడలేదు.
ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిందని విష్ చేయడానికి ఇంటికివెళితే ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం, నా భార్యబిడ్డలు, వారి బాగోగులు గురించి అడిగిన తీరు చూసి నాలో నేనే బాధ పడ్డాను. ‘ఇలాంటి వ్యక్తినా నా నోటితో తప్పుగా మాట్లాడాను’ అని నా తప్పు తెలుసుకుని క్షమించమని అన్నయ్యను అడిగాను. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అన్నయ్య మనసారా మాట్లాడటమే కాకుండా ‘కలిసి పని చేద్దాం.. మంచి కథ చూడు’ అన్నారు. ఈసారి మీతో చేయబోయే సినిమా దేశమంతా గుర్తుంచుకునేలా ఉంటుంది అన్నయ్య. అంత గొప్ప కథ రాస్తాను. అంటూ అన్నయ్యకు తెలిపాను. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనకు సోదరుడిగా పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ చిన్నికృష్ణ చెప్పుకోచ్చాడు.