Arvind Kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఐదో సారి సమన్లు పంపించింది. శుక్రవారం ఆయనను విచారణకు పిలిచింది. కాగా, సీఎం కేజ్రీవాల్ నేడు కూడా ఈడీ ఎదుట హాజరుకాలేదు. ఈ క్రమంలో ఆయన ఈడీ సమన్లపై స్పందించారు. సమన్లు చట్టవిరుద్ధమని ఆయన ప్రకటించారు. అదే సమయంలో మోడీ ప్రభుత్వంపై ఆప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈడీ సమన్లుచట్టవిరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధ్యేయమని, ఆయన్ను అరెస్టు చేయడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇది జరగడానికి మేము అస్సలు అనుమతించము. ఇంతకు ముందు, సీఎం కేజ్రీవాల్ నాలుగుసార్లు ఈడీ ఎదుట హాజరు కావడానికి నిరాకరించారు. జనవరి 17, జనవరి 3, డిసెంబరు 21, నవంబర్ 2 తేదీల్లో ఈడీ విచారణకు సమన్లు పంపినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ సమయంలో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని పార్టీ ఆరోపిస్తూనే ఉంది. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలలోపు తనను అరెస్ట్ చేయాలన్నది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర అని ఢిల్లీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.