»A Case Should Be Registered Against Minister Srinivas Goud Nampally Court Of Public Representatives
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలి
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్(srinivas goud)పై కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ విషయంలో ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని తెలిపింది.
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(srinivas goud)కు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు షాకింగ్ న్యూస్ చెప్పింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ట్యాంపరింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రితోపాటు పలువురు ఐఏఎస్ అధికారులపై కూడా కేసులు పెట్టాలని వెల్లడించింది. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు మాత్రం మీడియాతో తెలుపవద్దని కోరింది.
2018లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు పిటిషన్లను ఎదుర్కొంటున్నారు. గౌడ్ 14-11-2018, 19-11-2018 తేదీలతో మూడు అఫిడవిట్లు, మరొకటి వేర్వేరు తేదీల్లో దాఖలు చేశారన్నది పిటిషనర్ రాఘవేంద్రరాజు వాదన. రిటర్నింగ్ అధికారితో కుమ్మక్కయ్యారనే ఆరోపణలతో అతను 14-11-2018 నాటి అఫిడవిట్‌ను ఆర్పి(RP) చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం.లక్ష్మణ్..మంత్రి(minister) తన ఎన్నికల అఫిడవిట్‌ను సవరించుకోవడానికి చట్టం అనుమతించిందని స్పష్టం చేసింది.
మరో పరిణామంలో మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar)పై దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్లో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి జస్టిస్ చిల్లకూరు సుమలత రిటైర్డ్ జిల్లా జడ్జి శైలజను నియమించారు. 2018లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కమలాకర్ ఎన్నికను పక్కన పెట్టాలని సంజయ్ హైకోర్టును కోరుతున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్(srinivas goud) ఎన్నిక చెల్లదని పిటిషనర్ రాజు వేసిన అంశంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వచ్చే సోమవారంలోగా విచారణకు ప్రతిపాదించిన సాక్షుల జాబితాను దాఖలు చేయాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. దీంతోపాటు శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన 19-11-2018 నాటి అఫిడవిట్‌ను కోర్టు రికార్డు చేసింది. కోర్టు అనుమతి లేకుండా కోర్టు వ్యవహారాలను మీడియాతో ప్రస్తావించవద్దని జస్టిస్ లక్ష్మణ్ రాజును ఆదేశించారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు.