Manchu Manoj Couples Meet With The Chandrababu Naidu
Manchu Manoj Couples: ఏపీ పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి. రాజకీయ సమీకరణాలు ఛేంజ్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికకు సమయం ఉన్నప్పటికీ.. పార్టీలు, సీట్ల లెక్కల్లో ఉన్నారు. ప్రముఖ పార్టీలు సినీ తారలను చేర్చుకోవాలని అనుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మంచు మనోజ్ (Manchu Manoj ) దంపతులు భేటీ అయ్యారు.
చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి భేటీ నేపథ్యంలో మంచు మనోజ్ పార్టీలో చేరతారా అనే సందేహాం కలుగుతోంది. మంచు మనోజ్ (Manchu Manoj ) భార్య భూమా మౌనిక రాజకీయ రంగానికి చెందిన వారు, ఆమె పేరంట్స్ ఇద్దరు పొలిటిషీయన్స్.. కానీ చనిపోయారు. మౌనిక సోదరి అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. సో.. ఇప్పుడు చెల్లి కూడా టీడీపీలో చేరుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మౌనికకు నంద్యాల నుంచి టికెట్ ఇవ్వడమా.. లేదంటే మనోజ్‌ను (Manchu Manoj ) చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే ఆలోచనలు చర్చలు జరిగాయని తెలిసింది. నంద్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన భూమా బ్రహ్మానందరెడ్డి చాలా రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మౌనికకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.
2019 ఎన్నికల సమయంలోనే మంచు మనోజ్ (Manchu Manoj ) రాజకీయ ఆరంగ్రేటం గురించి చర్చ జరిగింది. ఆ సమయంలో మంచు ఫ్యామిలీ వైసీపీకి దగ్గరగా ఉంది. చిత్తూరు జిల్లాలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. రెండు నియోజకవర్గాల్లో మనోజ్ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. అదీ అలానే ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడంతో.. టీడీపీలో చేరిక లాంఛనమే కానుంది.