Ponguleti And Jupally Will Be Joined The Congress Party
Ponguleti And Jupally: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావుతో (Jupally Krishna Rao) కాంగ్రెస్ నేతల సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయి. ఆ పార్టీలో చేరేందుకు ఇద్దరు నేతలు సుముఖంగా ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. గత కొద్దీరోజుల నుంచి కాంగ్రెస్ నేతలు మల్లు రవి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చలు జరిపారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్తో ఈ రోజు జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సమావేశం అయ్యారు. దీంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్లారిటీ వచ్చినట్టు ఉంది.
జూపల్లి- సంపత్ చర్చలు
సంపత్ కుమార్తో జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సుధీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశంపై స్పష్టత వచ్చినట్టు ఉంది. ఈ నెలాఖరున పొంగులేటి, జూపల్లి (Jupally) కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిసింది. ఇద్దరు ఓకే వేదిక మీద కాకుండా.. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలులో జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సభ పెట్టి చేరతారని సంపత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉండగా.. ఆయన స్వదేశం వచ్చిన తర్వాత చేరికలు ఉంటాయని తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీనం, పార్టీతో కలిసి పనిచేసే అంశాల గురించి మాట్లాడామని సంపత్ కుమార్ తెలిపారు.
మరీ ఈటల..?
జూన్ 15వ తేదీ తర్వాత తాము ఏ పార్టీలో చేరే అంశంపై క్లారిటీ వస్తుందని ఇదివరకే జూపల్లి (Jupally) ప్రకటించారు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు.. సీట్ల సంఖ్యపై స్పష్టత రాలేదు. దీంతో వెనకడుగు వేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) తనకు ఖమ్మం జిల్లాలో 10 టికెట్లు కావాలని కోరుతున్నారని తెలిసింది. ఆ విషయంపై మాట ఇవ్వడంలో లేట్ అయ్యింది. లేదంటే వీరిద్దరూ నేతలు ఇదివరకే ఏదో ఒక పార్టీలో చేరే వారు. తమ లక్ష్యం కేసీఆర్ను (kcr) గద్దె దించడం అంటున్నారు. తమతో మిగతా నేతలు కూడా కలిసి వస్తారని ప్రకటించారు. అవసరమైతే ఈటల రాజేందర్ కూడా కలుస్తారని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ ఇలా
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మరో 6-7 నుంచి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తిరిగి ప్రభుత్వం చేపడుతామనే ధీమాతో అధికార పార్టీ ఉంది. టీ కాంగ్రెస్లో కుమ్ములాటలు ఉండనే ఉన్నాయి. టీ బీజేపీ కూడా అంతే సంగతులు.. అక్కడ కూడా కొట్లాటలు ఉంటాయి. వీటిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నారు.