E.G: గోదావరి డెల్టా ఆయకట్టులో ఈ ఏడాది రబీలో సాగునీటి కష్టాలు తప్పేటట్లు లేవని గోదావరి హెడ్ వర్క్స్ ఎస్ఈ కే. గోపీనాథ్ తెలిపారు. సాగు, తాగు, పరిశ్రమలకు కలిపి మొత్తం 93.26 టీఎంసీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 73.36 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొన్నారు. దీంతో గోదావరి డెల్టాలో పంటలు పండించే రైతులు ఆందోళన చెందుతున్నారు.