VZM: విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గజపతినగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హెచ్ఎం వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ ప్రకాశరావు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ డే జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ రామారావు, ఏఎంసీ ఛైర్మన్ గోపాల రాజు పాల్గొన్నారు.