WGL: మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఉదయం 6 నుంచే గ్రామాల్లో తిరుగుతూ గడపగడప ప్రచారం చేస్తున్నారు. ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లిన ఓటర్లకు ఫోన్లు చేసి రానుపోను ఖర్చులతోపాటు ఓటు రోజు ఖర్చు ఇస్తామని ఒప్పించి గ్రామానికి రప్పిస్తున్నారు. ఒక్కో ఓటు కీలకమన్న నమ్మకంతో అందరినీ కవర్ చేస్తున్నారు.