KDP: హోటళ్లు, కాయగూరల మండిలు వద్ద ఉన్న ప్రభుత్వ నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పులివెందల పట్టణంలోని పలు షాపులను, అంగళ్లను తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే అటువంటి షాపులను రద్దు చేస్తామన్నారు.