Hanumakonda : ప్లీజ్ బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి : బండి సంజయ్
ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ(CBI) వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్( Warangal) లో జరిగిన నిరుద్యోగ మార్చ్ (Unemployment march) లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు.
భారతీయ జనతా పార్టీ (BJP) కీ ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) కోరారు.వరంగల్ నగరంలోని హనుమకొండ (Hanumakonda) అంబేద్కర్ సెంటర్ లో నిరుద్యోగ మార్చ్ (Unemployment march) ముగింపు ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్(CM KCR), బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.నన్ను అరెస్ట్ చేసిన చోటే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం అని బండి సంజయ్ తెలిపారు. ఓరుగల్లు(Orugallu) గడ్డ నుండే కాషాయ పోరు మొదలైందన్నారు. కష్టపడి చదువుకున్న బిడ్డల జీవితాలు ఆగం అయ్యాయి. కేసీఆర్ కపట నాటకాలను బరిద్దామా..? తెగించి కొట్లాడుడే. 30లక్షల మంది యువత జీవితాలు నాశనం చేసింది ఈ పార్టీ. ఏ పేపర్ లీకైనా బండి సంజయ్ అంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది. సీఎంకు సెంటిమెంట్ లేదు.
విద్యార్థుల ఉద్యమ గడ్డ, ప్రోఫెసర్ జయశకంర్ పుట్టిన గడ్డ వరంగల్ అని, మమ్మల్ని అరెస్ట్ చేస్తే భయపడే కార్యకర్తలం కాదని ఆయన అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అన్న తెలంగాణాలో నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు. ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తానని తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు.రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి సమయంలో అరెస్ట్ చేశారు. నా అత్త దశదిన కర్మ జరుగుతుంటే అరెస్ట్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పేపర్ లీక్ పై దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీ (BJP) చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు. రాజశ్యామల యాగం కోసం కాలు విరిగిందని నాటకం ఆడారు. 30లక్షల మంది యువత భవిష్యత్తు ఆగమైనా.. సీఎం కేసీఆర్ (CM KCR) ప్రగతి భవన్ నుండి బయటకు రాలేదు. ఈ మూర్కుడి పాలన కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నామా అని నిరుద్యోగులు తల్లడిల్లిపోతున్నారు. మీ కోసం చావడానికైనా సిద్ధం. నీ కొడుకు ట్విట్టర్ టిల్లు రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
నిరుద్యోగ మార్చ్ కు స్పందన లేదన్న వారు కంటి ఆపరేషన్ చేసుకోండి. పది ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ ఉంటుంది. భాగ్యనగర్ (Bhagyanagar) లో మిలియన్ మార్చ్ ఉంటుంది. సిట్ (Sit) అట్టర్ ఫ్లాప్. సిట్ ను మేము ఒప్పుకోమున్నరు. సిట్టింగ్ జడ్జి(Sitting Judge)తో విచారణ జరపాలి. TSPSC కమిషన్ ను రద్దు చేయాలి. నాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. న్యాయమే గెలుస్తుంది. కేసీఆర్.. పేద విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఈ రజాకార్ల పాలనను తెలంగాణ(Telangana) పొలిమేరల వరకు తరిమికొడతాం. మళ్ళీ ఆంధ్రా – తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదు” అని ఫైర్ అయ్యారు బండి సంజయ్.