»The Winner Of Femina Miss India Is Nandini Gupta A Rajasthani Woman
Imphal : ‘ఫెమీనా మిస్ ఇండియా’ విజేత రాజస్థానీ భామ నందినీ గుప్తా
తాజాగా జరిగిన 59వ ఫెమీనా మిస్ ఇండియా (Femina Miss India) పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన బ్యూటీస్ పోటీపడ్డారు. వీరు తమ అందంతోనే కాదు, తెలివితోనూ కూడా జడ్డిల ప్రశంసలు అందుకున్నారు. బాగా ఇంప్రెస్ చేసిన 19 ఏళ్ల నందిని గుప్త (Nandini Gupta) మిస్ ఇండియా కిరిటీన్నా ఎగేరసుకుపోయింది.
ఫెమీనా మిస్ ఇండియా (Femina Miss India) 2023 కిరీటాన్ని19 ఏళ్ల రాజస్థాన్ భామ నందినీ గుప్తా (Nandini Gupta) సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక 59వ ఎడిషన్ ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్ రాజధాని ఇంఫాల్(Imphal) లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియం(Indoor Stadium) లో అట్టహాసంగా నిర్వహించారు.మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు మిస్ ఇండియా కిరీటం కోసం పోటీ పడ్డారు.చివరికి, తన అందం, అభియనంతో ఆకట్టుకున్న రాజస్థాన్‌లోని కోటా(KOTA )కు చెందిన నందినీ గుప్తా విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమానికి కార్తీక్ ఆర్యన్(Karthik Aryan), అనన్య పాండే వంటి సినీ తారలు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక్, అనన్య వేదికపై డ్యాన్స్ చేసి అలరించారు.
అన్ని పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నందినీ గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీశెట్టి ఆమెకు కిరీటాన్ని తొడిగారు. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ వరుసగా మొదటి, రెండో రన్నరప్‌గా నిలిచారు. ఇక ఈ సంవత్సరం మన తెలుగు రాష్ట్రాల అమ్మాయిలైన గోమతి (Gomati) (ఏపీ), ఊర్మిళ చౌహాన్(తెలంగాణ)లు కూడా గట్టి పోటీనే ఇచ్చారు. ఈ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ స్టార్లు అయిన కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే (Ananya Pandey) స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. వీరు తమ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. మాజీ విజేతలు సినీ శెట్టి, రూబల్ షెకావత్(Rubal Shekhavat), షినతా చౌహాన్, మానస వారణాసి, మాణికా షియోకంద్, మాన్య సింగ్, సుమన్ రావ్ శివాని జాదవ్ కూడా అద్భుతమైన మోహే లెహంగాలు ధరించి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. మనీష్ పాల్ మరియు భూమి పెడ్నేకర్ తదితర బృందం అందరి చేత నవ్వులు పూయించారు.