TSPSC: పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(Tspsc) కీలక ప్రకటన విడుదల చేసింది. పలు ఉద్యోగ నియామక పరీక్షల(Exams)కు కొత్త తేదీలను ప్రకటించింది.
ప్రశ్నాపత్రాల లీకేజీతో పలు పరీక్షలు(Exams) వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పరీక్షల కొత్త తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(TSPSC) ప్రకటించింది. ఏప్రిల్ 23న జరగాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షను జూన్ 28వ తేదిన నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష ఈ నెల 25వ తేదిన జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను మే 16వ తేది నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రకటించింది.
గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ గెజిటెడ్ పోస్టులకు పరీక్షల(Exams)ను ఏప్రిల్ 26, 27వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలను జూలై 18, 19వ తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రకటించింది. మే 7వ తేదిన జరగాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ మే 19వ తేదికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
గ్రౌండ్ వాటర్ లో నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షల(Exams)ను జూలై 20, 21వ తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ(TSPSC) తెలిపింది. వాయిదా పడ్డ ఈ పరీక్ష తేదీలను ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను అభ్యర్థులు తెలుసుకుని పరీక్షల(Exams)కు ప్రిపేర్ కావాలని కోరింది.