Congress leader shabbir ali made sensational comments
Shabbir Ali:కాంగ్రెస్ ముఖ్యనేత షబ్బీర్ అలీ (Shabbir Ali) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ (kcr) పాలనలో ప్రజలు విసుగెత్తి పోయారని ఆరోపించారు. ప్రజలు తుపాకీ పట్టే రోజు వస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. సమస్యల కోసం ఉద్యమించాల్సి వస్తోందని.. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నక్సలిజం (naxals) పుట్టుకొస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని చెప్పారు. సబ్బండ వర్గాలు ఆందోళనతో ఉన్నారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలే నెరవేర్చడం లేదని షబ్బీర్ అలీ (Shabbir Ali) తీవ్రస్థాయిలో విమర్శించారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రస్తావించారు. పేపర్ లీకేజీతో 30 లక్షల మంది (30 lakhs) నిరుద్యోగులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. 4 పేపర్లు ఎలా లీక్ అవుతాయని అడిగారు. దీంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందని షబ్బీర్ అలీ (Shabbir Ali) పేర్కొన్నారు. పదో తరగతి తెలుగు, హిందీ పేపర్ కూడా లీకయిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ (kcr) అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు అవుతుందని.. నిరుద్యోగులకు కొలువు లేదు.. కానీ కేసీఆర్ కుటుంబానికి (kcr family) మాత్రం ఉద్యోగాలు దొరికాయని చెప్పారు. 40 మంది రాజభోగం అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు (water), నిధులు (funds), నియామకల (jobs) కోసం.. జాబ్స్ విషయం ప్రభుత్వం మరచిపోయిందని షబ్బీర్ అలీ సహా విపక్ష నేతలు మండిపడుతున్నారు. గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో 80 వేలకు (80 thousand jobs) పైగా జాబ్స్ భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత 30 వేలకు పైగా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగులు ఆశగా ఎదురుచూశారు. ఇంతలో పేపర్ లీకేజీ పిడుగు లాంటి వార్త వారిని ఆందోళనకు గురిచేసింది. మరో 7,8 నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు భర్తీ చేయడం వీలు కాదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.