Viveka హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అనినాష్ ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలను తెలియజేసింది. వివేకా హత్య గురించి ఉదయ్‌కు ముందే తెలుసు అని పేర్కొంది.
YS Viveka case:వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసులో సీబీఐ (cbi) విచారణ తుది దశకు చేరుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి (avinash reddy), ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని (bhaskar reddy) ఇప్పటికే పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అనినాష్ ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని (uday kumar reddy) అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ (uday) రిమాండ్ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలను తెలియజేసింది. వివేకా (Viveka) హత్య గురించి ఉదయ్‌కు (uday) ముందే తెలుసు అని పేర్కొంది.
వివేకానంద (Viveka) హత్య జరిగిన రెండు నిమిషాల్లో ఉదయ్ (uday), అవినాష్ రెడ్డి (avinash), భాస్కర్ రెడ్డి (bhaskar reddy), శివ శంకర్ రెడ్డి (shivashankar reddy) ఘటనా స్థలానికి చేరుకున్నారట. వీరికి సంబంధించి గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించిన లొకేషన్ (location) వివరాలను రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. హత్య జరిగిన చోట సాక్ష్యాధారాలను తొలగించేందుకు ప్రయత్నించారని సీబీఐ అధికారులు చెబుతున్నారు.
వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ (uday) ప్రమేయానికి సంబంధించి సైంటిఫిక్ ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేశామని సీబీఐ అధికారులు (cbi officials) చెబుతున్నారు. ఉదయ్ (uday) పారిపోతారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హత్య జరిగిన చోట లొకేషన్ (location) వివరాలు చూపించి.. ప్రశ్నించినా ఉదయ్ (uday) నోరు మెదపడం లేదని పోలీసులు (police) చెబుతున్నారు.
ఉదయ్ కుమార్ రెడ్డి కడప జిల్లా తుమ్మపల్లి యురేనియం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అవినాష్‌కు (avinash) సన్నిహితుడు.. హత్య విషయం తెలిసిన వెంటనే అవినాష్‌తోపాటు స్పాట్‌కు చేరుకున్నాడు. వివేకా (Viveka) మృతదేహానికి బ్యాండేజ్ వేసి కట్టు కట్టారని.. సాక్ష్యాలను మాయం చేశారని సీబీఐ అధికారులు చెబుతున్నారు. వివేకా హత్య జరిగిన రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఉదయ్ (uday) కీ రోల్ పోషించారని గుర్తించారు.
వివేకా హత్య 2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్దీరోజుల ముందు జరిగింది. కేసు విచారణ కోసం వెంటనే సిట్ ఏర్పాటు చేయగా.. తర్వాత సీబీఐకి బదిలీ చేసింది. విచారణను తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ నెలాఖారులోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ ఎంక్వైరీ స్పీడప్ చేసింది. వివేకా హత్య కేసులో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.