»Fight Against Steel Plant Privatizationjd Laxminarayana
vizag steel plant privatisationపై ఇక పోరుబాటే.. పాదయాత్ర ట్రైలరే అంటోన్న జేడీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పోరాటం చేయాల్సిందేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మేధావులు, నిర్వాసితులు, కార్మికులతో కలిసి ఉద్యమించాలని కోరారు.
Fight against steel plant privatization:JD laxminarayana
vizag steel plant:విశాఖ స్టీల్ ప్లాంట్ (vizag steel plant) ప్రైవేటీకరణ అంశంపై పోరాటం చేయాల్సిందేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (laxmi narayana) అన్నారు. మేధావులు, నిర్వాసితులు, కార్మికులతో కలిసి ఉద్యమించాలని కోరారు. ప్రజల తరఫున విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్‌లో (bidding) పాల్గొంటానని లక్ష్మీనారాయణ (laxmi narayana) పేర్కొన్నారు. కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కుపై పూటకో ప్రకటన చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై కార్మికులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రకటన చేసిన కేంద్రమంత్రి కులస్తీ ప్లెక్సీపై కోడిగుడ్లు, టమాటలు వేసి నిరసన తెలుపుతున్నారు.
స్టీల్ ప్లాంట్ (steel plant) ప్రైవేటీకరణ గురించి కేంద్ర ప్రభుత్వం గడికో మాట మాట్లాడటం సరికాదన్నారు. కేంద్రమంత్రి ఉదయం రాష్ట్రానికి వచ్చి ప్రైవేటీకరించడం లేదని చెబుతారు.. ఆ వెంటనే ఢిల్లీలో సాయంత్రం ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రకటన వస్తోంది. ఎందుకు ఇలా గందరగోళ ప్రకటనలు చేస్తున్నారు అని అడిగారు. ఇదీ మంచి పద్దతి కాదని హితవు పలికారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ (steel plant) ప్రైవేట్ పరం కావొద్దని జేడీ లక్ష్మీనారాయణ (jd) అన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రైవేత్ వ్యక్తుల చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని అన్నారు. బిడ్డింగ్‌లో ప్రభుత్వాలే పాల్గొనాలని జేడీ కోరారు. అవసరమైతే తాను బిడ్డింగ్‌లో ప్రజల తరఫున పాల్గొంటానని వివరించారు. ఈ రోజు జరుగుతున్న పాదయాత్ర ట్రైలర్ (trailer) మాత్రమేనని.. ముందు ముందు ఆందోళనలను ఉధృతం చేస్తామని వివరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ (vizag steel plant) ప్రైవేట్ పరం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోం అని తేల్చిచెప్పారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వరసగా ప్రకటనలు చేస్తోంది. ప్రైవేటీకరణ వద్దు అని తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.. సీఎం కేసీఆర్ కూడా మాట్లాడారు. దీంతో ప్రైవేటీకరణ లేదని కేంద్రమంత్రి ప్రకటన చేశారు. ఆ వెంటనే ప్రైవేటీకరణ ఉంటుందని మరో స్టేట్ మెంట్ రావడంతో గందరగోళం నెలకొంది.