»Andhra Pradesh Former Cbi Jd Lakshminarayanas Partys Election Symbol Is Torchlight
Andhra Pradesh: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల గుర్తు టార్చిలైట్
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కొత్తగా ఆవిర్భవించిన పార్టీకి ఎన్నికల గుర్తును కేటాయించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) ఈరోజు కేటాయించింది.
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కొత్తగా ఆవిర్భవించిన పార్టీకి ఎన్నికల గుర్తును కేటాయించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) ఈరోజు కేటాయించింది. మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయినప్పటికీ.. సీబీఐ జాయింట్ డైరెక్టర్(జేడీ)గా ఉన్నప్పుడు.. జగన్, గాలి జనార్దన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ సందర్భంగా లక్ష్మీనారాయణ అందరికీ దగ్గరయ్యారు. ఓ దశలో జగన్ యాంటీ మీడియాకు లీకులు ఇస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక 2018లోనే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.
గత ఎన్నికల్లో ఏపీలోని విశాఖపట్టణం నుంచి జనసేన తరఫున ఎంపీగా బరిలో దిగి పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. కొన్నాళ్ల కిందట జైభారత్ నేషనల్ పార్టీని ప్రారంభించారు. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు తన ఆదర్శ భావాలను యువత, విద్యార్థులకు చేరవేసేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించారు. విశాల భావాలను వ్యాపింపజేసేందుకు పాటుపడ్డారు. నిరాశలో ఉన్నవారికి దారి చూపే దీపంగా కనిపించేవారు. అలాంటి వ్యక్తి పార్టీకి చీకటిలో దారి చూపే టార్చి లైట్ గుర్తు రావడం చెప్పుకోదగ్గదే.