»Welcome To Tihar Jail Sukesh Writes Another Letter
sukesh మరో లేఖ.. తీహార్ జైలుకు వెల్ కం, ముందు కేజ్రీవాల్, తర్వాతే కవిత అంటూ..
ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలులో ఉంటూనే లేఖలతో ప్రకంపనలు రేపుతున్నాడు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాట్‌కు సంబంధించి లేఖ విడుదల చేయగా.. ఇప్పుడు మరో లేఖ బయటకు వచ్చింది.
Welcome to tihar jail, sukesh writes another letter
sukesh:ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ (sukesh chandrasekhar) తీహార్ జైలులో (tihar jail) ఉంటూనే లేఖలతో ప్రకంపనలు రేపుతున్నాడు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో (kavitha) చేసిన చాట్‌కు సంబంధించి లేఖ రాసిన సంగతి తెలిసిందే. మళ్లీ కవిత (kavitha).. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) లక్ష్యంగా లేఖ రాశాడు. లిక్కర్ స్కామ్‌లో వారిద్దరిరీ తీహార్ జైలు (tihar jail) వెల్ కం చెబుతుందని అన్నాడు. సుఖేశ్ (sukesh) జైలులో ఉన్నాడు. అయినప్పటికీ తన లాయర్ ద్వారా లేఖలను విడుదల చేస్తున్నాడు.
లిక్కర్ స్కామ్‌లో కవితను (kavitha) ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారించారు. అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేజ్రీవాల్ (kejriwal), కవిత (kavitha) అని మరో లేఖ విడుదల చేశాడు. కవితతో మాట్లాడిన రెండు లేఖలను సుఖేశ్ రాశాడు. ఆ నంబర్లతోనే కవితకు కాల్ చేశానని చెప్పాడు.
సుఖేశ్ (sukesh).. స్వస్థలం కర్ణాటక.. దీంతో ఆయనకు తెలుగు ఎలా వచ్చు అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సుఖేశ్ లేఖలో రాశాడు. తెలుగు, తమిళం కూడా తనకు మాతృభాష అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి పేరంట్స్ తెలుగు, తమిళంలో మాట్లాడేవారని.. తెలుగు తన మాతృభాష అని తెలిపాడు.
కవిత(kavitha), కేజ్రీవాల్‌తో (kejriwal) మాట్లాడిన, చాట్ చేసిన ఫోటోలు, వీడియోలు అన్నీ తన టీమ్ వద్ద భద్రంగా ఉన్నాయని వివరించాడు. లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థలు కోరినా వెంటనే ఆధారాలను సమర్పిస్తుందని లేఖలో తెలిపాడు.
కవితతో చాట్ చేసిన నంబర్లు 62099 99999, 89856 99999 నంబర్లు అని స్క్రీన్ షాట్ తీశాడు. సత్యేంద్ర జైన్ పర్సనల్ మొబైల్ నంబర్ 98101 54102 అని రాశాడు. తీహార్ జైలుకు ముందు కేజ్రీవాల్.. ఆ తర్వాత కవిత వస్తారని పేర్కొన్నాడు. కేజ్రీవాల్‌తో జరిగిన చాట్స్ కూడా రిలీజ్ చేస్తానని చెబుతున్నాడు.