ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత క్రికెట్ ప్లేయర్లు అందరూ వివిధ రకాలుగా రిలాక్స్ అవుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు మండే ఎండల్లో ఆడుతూ క్రికెట్ అభిమానులను అలరించిన ఆటగాళ్లు తమకు తోచిన రీతిలో ఎంజాయ్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ మాత్రం యూ ట్యూబ్‌లో కొన్ని హాట్ హాట్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు బహిర్గతం అయింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Cricketer Ryan Parag Google Search History Leak.. Viral
Riyan Parag : రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్కి హీరోయిన్ అనన్యా పాండే అంటే ఇష్టమా? అనన్యా పాండేతో పాటు మరో బాలీవుడ్ భామ సారా ఆలీ ఖాన్‌పై కూడా పరాగ్ మనసు పారేసుకున్నాడా? వారిద్దరూ అంటే రియాన్ పరాగ్‌కు అంత ఇష్టమా.. అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజాగా రియాన్ పరాగ్ యూ ట్యూట్ హిస్టరీ అదే చెబుతోంది. ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత క్రికెట్ ప్లేయర్లు అందరూ వివిధ రకాలుగా రిలాక్స్ అవుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు మండే ఎండల్లో ఆడుతూ క్రికెట్ అభిమానులను అలరించిన ఆటగాళ్లు తమకు తోచిన రీతిలో ఎంజాయ్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ మాత్రం యూ ట్యూబ్‌లో కొన్ని హాట్ హాట్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు బహిర్గతం అయింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
యూ ట్యూబ్‌లో హాట్ వీడియోలు చూస్తూ రిలాక్స్ అవుతున్న పరాగ్…లైవ్ స్ట్రీమింగ్ సమయంలో దొరికిపోయాడు. కొంత సేపు లైవ్ స్రీమింగ్లో కనిపించిన పరాగ్… తన స్క్రీన్‌ను హైడ్ చేయడం మరిచిపోయాడు. ఆ సమయంలో ఓ కాపీరైట్ లేని ఫ్రీ మ్యూజిక్ కోసం వెతికే క్రమంలో … పరాగ్ సెర్చ్ హిస్టరీ స్క్రీన్‌పై కనిపించింది. ఆ హిస్టరీలో అనన్యా పాండే హాట్, సారా ఆలీ ఖాన్ హాట్ అనే పేర్లలో పరాగ్ వీడియోలు చూసినట్లుగా తెలుస్తోంది. ఆ సెర్చ్ హిస్టరీని చాలా మంది పట్టుకున్నారు. స్క్రీన్ షాట్లు తీశారు. వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్టు చేశారు. పరాగ్ పరువు తీస్తున్నారు. పరాగ్ ఇలాంటి వాడని అనుకోలేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. పరాగ్ సెర్చ్ హిస్టరీ చూసిన మరికొందరు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. 22 ఏళ్ల యువకుడు ఏం చేస్తాడో రియాన్ పరాగ్ కూడా అదే చేస్తున్నాడని చెబుతున్నారు. పరాగ్ ప్రైవేట్ వ్యవహారాలను బహిర్గతం చేయడం అతని పరువు తీయడమేనని కొందరు మండిపడుతున్నారు. కొందరు బుద్ధిలేని వెధవలు డబ్బులు సంపాదించడానికి ఇటువంటి పనులు చేస్తున్నారని ఇంకో నెటిజన్ మండిపడ్డాడు.
అనన్యా పాండే, సారా ఆలీ ఖాన్లు అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించారు. మంచి పాపులారిటీ సాధించారు. దేశంలో కోట్లాది మంది యువకులకు హాట్ ఫేవరెట్లుగా మారారు. సినిమాల్లో నటించడంతో పాటు అనేక కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ ఎప్పటికప్పుడు టీవీ తెరలపై కూడా దర్శనం ఇస్తున్నారు. దీంతో వారిద్దరికీ పాపులారిటీ మరింత పెరిగింది. ఒకప్పటి బాలీవుడ్ కమెడియన్ చుంకీ పాండే కుమార్తె అనన్యా పాండే. కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ కుమార్తెకు అనన్యా పాండే ఎంతో క్లోజ్. దీంతో కేకేఆర్ ఆడే ఐపీఎల్ మ్యాచుల్లో షారుఖ్ కుమార్తెతో పాటు అనన్య పాండే కూడా సందడి చేసింది. అనేక సార్లు తళుక్కున మెరిసింది. ఎంతో స్టయిలిష్ లుక్స్ తో ఉండే ఆమె తమ తెలుగు స్టార్ విజయదేవరకొండతో లైగర్ సినిమాలో నటించింది. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కేకేఆర్ జట్టు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ సెలబ్రేషన్స్‌లో అనన్యా పాండే కూడా పాల్గొంది. కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్‌తో కలిసి చిందులు వేసింది. లుట్ పుట్ గయా అనే సాంగ్‌కు ఇద్దరూ కలిసి డాన్స్ వేశారు. ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది.