డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar Reddy) అక్కినేని అఖిల్ (Akkineni Akhil)తో ఏజెంట్ మూవీ(Agent Movie)ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదిన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ వర్క్ ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. తాజాగా నేడు ఏజెంట్ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్(Press meet) నిర్వహించింది. ఏజెంట్ దర్శక నిర్మాతలతో పాటుగా హీరో అఖిల్, హీరోయిన్ సాక్షి వైద్య(sakshi vydya) ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
సురేందర్ రెడ్డి(Surendar Reddy) మాట్లాడుతూ ఏజెంట్ సినిమా(Agent Movie)కు అందరికంటే ఎక్కువగా అఖిల్ కష్టపడ్డాడని తెలిపారు. సినిమా పూర్తవ్వడానికి చాలా ఆలస్యమైందని, అంత వరకూ కూడా అఖిల్ సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేస్తూ వచ్చాడని తెలిపాడు. అఖిల్ అన్నీ చేయగలడని, ఆయనకున్న టాలెంట్ లో తాను సగం శాతం మాత్రమే వాడుకున్నట్లు సురేందర్ రెడ్డి తెలిపారు.
ఏజెంట్ (Agent Movie) హీరోయిన్ సాక్షి వైద్యను ఇన్ స్టాలో చూసి ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లు డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు. ఇంత వరకూ సాక్షి వైద్య ఏ సినిమాలోనూ నటించలేదని, నేరుగా సెట్ కి వచ్చి చెప్పింది చేసేదని తెలిపారు. ఒక్కోసారి సాక్షి వైద్య నుంచి అవుట్ పుట్ రాబట్టడం కోసం తిట్టాల్సి వచ్చిందని సురేందర్ రెడ్డి(Surendar Reddy) తెలిపారు. సాక్షి వైద్య(sakshi vydya)కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. మమ్ముట్టి(mammootty) వంటి స్టార్ హీరోతో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.