»Prabhuthva Junior College Punganur 500143 Glimpse Video Release
Movie Glimpse : ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ గ్లింప్స్ వీడియో రిలీజ్
సినీ ప్రియులకు కొత్త ఫీల్ అందించేందుకు యధార్థ సంఘటనల ఆధారంగా 'ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు'(Prabhuthva Junior College) అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్య యూత్‌కు కనెక్ట్ అయ్యే మూవీస్(Youthful Movies) చాలానే వస్తున్నాయి. తాజాగా ఓ యధార్థ సంఘటనల(Real Incidents) ఆధారంగా సరికొత్త లవ్ స్టోరీ(Love Story) తెరకెక్కుతోంది. డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′(Prabhuthva Junior College Punganur -500143) అనే టైటిల్ ను ఖరారు చేశారు. యువతకు నచ్చేలా వాస్తవ కథను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. విడుదలకు సిద్ధమైన ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతోంది.
‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో :
ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీ(Love Story)గా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్(Video Release) చేసింది. ఆ గ్లింప్స్(Glimps) సినిమాపై బజ్ ను పెరిగేలా చేసింది.
తెల్లవారుజామున మంచు పొగలాంటి ప్రేమ అనే వలయంలో చిక్కుకున్న ప్రేమికుల కోసం ఈ చిత్రం అంటూ గ్లింప్స్ (Glimps)లో కొటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత వీడియో సాగుతుంది. వీడియోలో మనసును హత్తుకునే మ్యూజిక్(Music) అందర్నీ కదిలిస్తోంది. ఈ మూవీకి కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరును అందించగా శ్రీసాయి కిరణ్ లిరిక్స్ రాశారు. ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకోనుంది. సినీ ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ ను అందించనుంది.