»A Liger Beauty Who Is Pregnant Out Of Wedlock Ananya Pandey Adhithya Chopra Umair Sandhu Tweet
Ananya Pandey: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన లైగర్ బ్యూటీ.?
లైగర్ హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్తలపై బీ టౌన్ లో వివాదం నడుస్తోంది.
A liger beauty who is pregnant out of wedlock. Ananya Pandey
Ananya Pandey: పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన లైగర్(Liger) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pande)పై సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తుంటాయి. హిందీ నటుడు చుంకీ పాండే(Chinki Pandey) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటనతో ఆకట్టుకుంటూ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వెళుతుంది. ప్రస్తుతం ఈమె సినిమాలతో బిజీగా ఉంది. డ్రీమ్ గర్ల్ 2(Dream Girl 2), ఖో గయా హమ్ ఖహాన్ (Kho Gaye Hum Kahan)సినిమాలతో పాటు కాల్ మి బా వెబ్ సిరీస్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మపై ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు(Umair Sandhu) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ హీరో ఆషికీ 2 చిత్రం ద్వారా సూపర్ హిట్ నేమ్ తుచ్చుకున్న నటుడు ఆదిత్య కపూర్(Adithya kapur)తో అనన్య పాండే ప్రేమాయణం నడుపుతున్నదని, ఈ ఇద్దరు స్పెయిన్(Spain) లో తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు, వారు వెకేషన్ కి వేరు వేరుగా వెళ్ళినప్పటికీ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కొన్ని నెట్టింట హల్చల్ చేస్తుండడంతో వారు స్పెయిన్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమైర్ సంధు(Umair Sandhu) చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.
స్పెయిన్ కి వెకేషన్ కోసం వెళ్లిన వీరు పగలు రాత్రి అనే తేడా లేకుండా శృంగారంలో మునిగి తేలుతున్నారు. వారు నాన్ స్టాప్ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారని. చూస్తుంటే ఈ ట్రిప్లో మనోడు ఆమెని ప్రెగ్నెంట్ కూడా చేసేలా ఉన్నాడని ఉమైర్ సంధు తన ట్వీట్లో రాసుకొచ్చాడు. ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పుడు బీ టౌన్(B town)లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అయితే ఉమైర్ గురించి తెలిసిన కొందరు అతన్ని పిచ్చోడిగా భావించి, తన ట్వీట్లను పెద్దగా లెక్కలోకి తీసుకోరు. మరికొందరు మాత్రం తనపై చాలా కోపంగా ఉన్నారు. భారతీయ యాక్టర్ల పైనే కాదు జనధారణ పొందిన ప్రతివారిపై ఇలా నోటికి వచ్చినట్లు రాస్తుంటాడు. దీనిపై అటు అనన్య కాని, ఇటు ఆదిత్య గానీ స్పందించలేదు.