Explosion in explosive solar company nagpur maharashtra 9 people died
హైదరాబాద్ శామీర్ పేటలో కాల్పులు చోటుచేసుకున్నాయి. విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపిన ఏపీకి చెందిన మనోజ్ నాయుడు. పెల్లెట్స్ నుంచి స్వల్ప గాయాలతో సిద్ధార్థ్ దాస్ తప్పించుకున్నారు. అయితే సిద్ధార్థ్ భార్య శ్వేత సెలబ్రిటీ క్లబ్ లో మనోజ్ తో గత మూడేళ్లుగా సహజీవనం చేస్తుంది. 2019లో సిద్ధార్థ్ దాస్ తో విడిపోయిన శ్వేత మనోజ్ తో ఉంటుంది. ఆ క్రమంలో సిద్ధార్థ్ కుమార్తె, అబ్బాయి ఆమెతోనే ఉంటున్నారు. అయితే ఆ చిన్నారులను మనోజ్ చిత్రహింసలకు గురిచేసినట్లు పిల్లలు CWC అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు తన తల్లి దగ్గర తాము ఉండలేమని సిద్ధార్థ్ కుమారుడు అంటున్నారు. తన చెల్లిని మనోజ్ కోడుతున్నారని చెబుతున్నారు.
ఆ క్రమంలో తాజాగా పిల్లలను చూసేందుకు అక్కడకు వచ్చిన సిద్ధార్థ్ దాస్ తో వారికి గొడవ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ గన్ తో మనోజ్ నాయుడు అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో బాధితుడు సిద్ధార్థ్ నాయుడి ఫిర్యాదు మేరకు శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ నాయుడుకు ఆ ఎయిర్ గన్ తన ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడని చెబుతున్నారని, దాని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.