పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(prabhas) నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్టు కే(Project K) మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఖారారైంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ తర్వాత ప్రభాస్(prabhas) చేస్తున్న అతి పెద్ద చిత్రం ప్రాజెక్ట్ కె(Project K)…నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన్న ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని ఎప్పటి నుంచో రూమర్స్ మొదలవ్వగా..ఇక ఈ విషయంలో టీమ్ ఇటీవల మరింత క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో కమల్ నటిస్తున్నట్లు..ప్రాజెక్ట్ కే టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ వీడియోను, ఓ పోస్టర్ విడుదల చేసింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ కి రాబోతుంది.
ఇక ‘ప్రాజెక్ట్ K’ టైటిల్‌ను USAలోని శాన్ డియాగో COMICCONలో ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌ను జూలై 20, 2023న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. దీనికోసం ఈ సినిమాలో నటిస్తోన్న కమల్ హాసన్, ప్రభాస్, దీపికాపదుకొనే, డైరెక్టర్ నాగ్ అశ్విన్ USAకి వెళ్లనున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా జులై 20న అమెరికాలో, ఇండియాలో జులై 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ మూవీని రానున్న 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు కాలచక్ర అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు టాక్ నడుస్తోంది.