»Alia Bhatt When Actress Picks Up And Returns Journos Slippers
Alia bhatt: ఫోటోగ్రాఫర్ చెప్పుపట్టిన అలియా భట్..ఎందుకు?
బాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో అలియా భట్(alia bhatt ) ఒకరు. ఆమె తన అప్రయత్నమైన ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. తాజాగా ఓ సంఘటనతో అభిమానుల నుంచి ప్రశంసలు పొందుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(alia bhatt) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వరస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. తాజాగా అలియా భట్ తన గొప్ప మనసు చాటుకుంది. దానికోసం ఆమె చేసిన పని ఏంటో తెలుసా? అసలు మ్యాటరేంటంటే.. బాలీవుడ్ నటి అలియా భట్, ఆమె తల్లి సోనీ రజ్దాన్, సోదరి షాహీన్ భట్‌తో కలిసి ఇటీవల ముంబై రెస్టారెంట్లో డిన్నర్ కోసం వెళ్లింది. దీంతో, ఆమెను ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్లు అత్యుత్సాహం చూపించారు. ఈ క్రమంలో ఓ ఫోటో గ్రాఫర్ తన చెప్పును జారవిడుచుకున్నాడు. అయితే, ఆమె ఎలాంటి గర్వం చూపించకుండా, అతని చెప్పును తీసుకొని స్వయంగా ఆమె ఫోటోగ్రాఫర్ కి ఇవ్వడం విశేషం.
వేదిక వెలుపల ఛాయాచిత్రకారులు కోసం పోజులిస్తుండగా, ఫోటోగ్రాఫర్(photographer)లలో ఒకరు స్లిప్పర్ పోగొట్టుకున్నట్లు అలియా గమనించింది. వీడియోలో బంధించబడిన హృదయపూర్వక క్షణంలో, ఆలియా స్లిప్పర్ని తీసుకొని సంబంధిత ఛాయాచిత్రకారులకు తిరిగి ఇచ్చింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒక స్టార్ నటి అందులోను బాలీవుడ్ స్టార్.. అంత ఇమేజ్ ఉన్న ఆలియా భట్ ఇలా చేయడం గ్రేట్ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ఆలియాను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.