»Rajasthan Spring Fans Are Installed In Hostels To Prevent Student Suicides
Spring Fans: ఐడియా అదుర్స్..చనిపోకుండా కొత్తరకం ఫ్యాన్లు
పోటీ పరీక్షలకు సన్నద్దం అయ్యే విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే వారిని రక్షించేందుకు అక్కడి కోచింగ్ సెంటర్లు ఓ అధునాతన ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రయోగం ఫలిస్తే చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చని భావిస్తున్నారు.
Spring Fans: పోటీ పరీక్షల(competitive examinations)కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ (Rajasthan)లోని కోటా (Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు (Suicides) దేశాన్ని కుదిపేస్తున్నాయి. కోటా జిల్లా కోచింగ్ సెంటర్ల (Coaching Centers)కు ప్రసిద్ధి చెందింది. దీని పరిష్కారం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేసిన స్థానిక యంత్రంగం ఎట్టకేలకు ఓ ఆలోచన చేసింది. ఇందులో భాగంగానే కోటాలోని అన్ని హాస్టళ్లు, పెయింగ్ గెస్ట్ వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి అనేక పోటీ పరీక్షల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి లక్షాలది మంది విద్యార్థులు కోటాకు వస్తారు. ఈ సంవత్సరం దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇక్కడ తరచూ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా కలవరం కలిగిస్తోంది. ఇప్పటికే 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే కోటా (Kota) జిల్లా యంత్రాంగం సమావేశమయింది. విద్యార్థుల ఆత్మహత్యల(Suicides)ను అధ్యాయనం చేసింది. ఎక్కువ మంది ఫ్యాన్‌కు ఉరేసుకునే మరణించినట్లు పేర్కొన్నారు. తక్షణమే హాస్టళ్లు, పీజీ గదుల్లో ఫ్యాన్స్‌ను తొలగించి వాటి స్థానంలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చాలని అదేశించారు. ఫ్యాన్‌పై బరువు పడగానే స్ప్రింగ్ ఉండడం మూలంగా కిందికి వేలాడుతుందని దాని ద్యారా సూసైడ్స్ను నివారించవచ్చని వెల్లడించారు. ఈ మేరకు యంత్రం ఈ పనులను వేగవంతం చేసింది. దీంతో పాటు కోచింగ్ సెంటర్లు(Coaching Centers) కచ్చితంగా విద్యార్థులకు వారంలో ఒక రోజు సెలవు ప్రకటించాలని పేర్కొన్నారు. తరగతి గదిలో 80 మందికి మించి విద్యార్థులు ఉండకూడదని, ఈ ఆదేశాలను పాటించని హాస్టళ్లు, వసతులను వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ స్ప్రింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు మంచి ఆలోచన అంటుంటే మరికొందరు కొట్టిపడేస్తున్నారు. విద్యార్థుల మనసిక ఆలోచనను మార్చాలని సలహాలు ఇస్తున్నారు.