»Only Educated People Should Vote Dismissal From Job Unacademy Employee Delhi Cm Arvind Kejriwal Reacts
Dismissal job: చదువుకున్న వారికే ఓటేయాలన్నాడు..జాబ్ నుంచి తొలగింపు..సీఎం రియాక్ట్
ఓ ఉపాధ్యాయుడు తాను బోధించే క్రమంలో భాగంగా చదువుకున్న ప్రజాప్రతినిధులకు మాత్రమే ఓటు వేయాలని విద్యార్థులకు సూచించాడు. అంతే ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతన్ని ఆ సంస్థ నిర్వహకులు తొలగించారు. ఇది తెలిసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(arvind kejriwal) వారిని ప్రశ్నించారు.
Only educated people should vote Dismissal from job unacademy employee delhi CM arvind kejriwal reacts
కరణ్ సంగ్వాన్ అనే ఉపాధ్యాయుడు “చదువుకున్న అభ్యర్థులకు” ఓటు వేయాలని విద్యార్థులను కోరాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎడ్ టెక్ సంస్థ అనాకాడెమీ(unacademy) అతని ఉద్యోగాన్ని తీసివేసింది. తరగతి గదిలో వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకోవడం సరికాదని అనాకాడెమీ సహ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ పేర్కొన్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా కరణ్ సాంగ్వాన్‌ను తొలగించామని వెల్లడించారు. అంతేకాదు తాము నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తాము మా విద్యావేత్తలందరికీ కఠినమైన ప్రవర్తనా నియమావళిని(rules) అమలు చేసామని అన్నారు. విద్యార్థులను తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నందున వ్యక్తిగత అభిప్రాయాలను తరగతి గదిలో పంచుకోకూడదని సైనీ వివరించారు. తరగతి గది వారి వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకోవడానికి స్థలం కాదని, ఎందుకంటే వారు వాటిని తప్పుగా ప్రభావితం చేయవచ్చని స్పష్టం చేశారు.
అయితే ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) ఈ ఎడ్టెక్ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించారు. చదువుకున్న రాజకీయ నాయకులకు ఓటు వేయమని ప్రజలను ప్రోత్సహించడం నేరమా అంటూ ప్రశ్నించారు. విద్యావంతులకు ఓటు వేయమని విజ్ఞప్తి చేయడం నేరం ఎలా అవుతుందన్నారు? ఎవరైనా నిరక్షరాస్యులైతే, వ్యక్తిగతంగా తాను అతన్ని గౌరవిస్తానని చెప్పారు. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకుడదని అన్నారు. ప్రస్తుతం 5జీ టెక్నాలజీ వచ్చిన యుగంలో కూడా నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధుల ద్వారా ఆధునిక భారత్ ను ప్రోత్సహించ లేరని ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారని గమనించవచ్చు. అతను సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, 1995లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)లో ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్‌గా కూడా పనిచేశారు.