»Five People Died After Going To Save The Bull At Piska Village Jharkhand
Five people died: ఎద్దును కాపాడేందుకు పోయి..ఐదుగురు మృతి
ఒక గ్రామంలోని బావిలో పడిపోయిన ఎద్దును కాపాడేందుకు పోయి ఐదుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఆ క్రమంలో మరో ఇద్దరిని రక్షించగా..బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు NDRF సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ విషాదఘటన జార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది.
Five people died after going to save the bull at Piska village Jharkhand
ఒక ఎద్దు(bull) అనుకోకుండా బావి(well)లో పడిపోయింది. అయితే ఆ తర్వాత వెంటనే గమనించిన స్థానికులు దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో దానిని రక్షించే ప్రయత్నంలో భాగంగా తొమ్మిది మంది బావి వద్దకు వెళ్లారు. అదే సమయంలో బావి అంచు పైభాగం కూలిపోయింది. దీంతో బావిలో ఏడుగురు పడిపోయారు. ఆ నేపథ్యంలోనే ఐదుగురు మృత్యువాత చెందగా..ఇద్దరిని రక్షించారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలోని పిస్కా గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ ఘటనపై అక్కడి సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. పిస్కా గ్రామంలోని బావిలో పడి ఐదుగురు వ్యక్తులు మరణించారనే విషాద వార్త తనను కలచివేసిందని అన్నారు. భగవంతుడు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, ఏజేఎస్‌యూ చీఫ్ సుధేష్ మహతోపాటు పోలీసు(police) అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఎద్దును బయటకు తీస్తుండగా ఏడుగురు మట్టిలో కూరుకుపోయారని సిల్లి పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి ఆకాశ్ దీప్ తెలిపారు. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా, ఐదుగురు మరణించారు. ప్రస్తుతం ఒక మృతదేహాన్ని బయటకు తీయగా, మిగిలిన మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీరంతా భూమికి నలభై అడుగుల లోతున ఉన్న బావిలో పడటంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు.