»Palnadu District Of Andhra Pradesh Sister And Brother Died After Eating Stored Meat
Storage food: నిల్వ మాంసహారం తిని అక్కా తమ్ముడు మృతి
సాధారణంగా ఏదైనా ఆహారం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తినడం అందరు చేసేదే. అయితే అలా నిల్వ ఉంచిన ఆహారం తిని ఓ కుటుంబంలోని అక్కా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Palnadu district of Andhra Pradesh, sister and brother died after eating stored meat
Stored Food: రాత్రి మిగిలిన ఆహారాన్ని(Food) పడేయ్యకుండా పొద్దున్నే పోప్ రైస్, లెమన్ రైస్ లాంటివి చేసుకొని తింటుంటారు. ప్రతి ఇంట్లో సర్వ సాధారణంగా జరిగే విషయం ఇది. అయితే చాలా మంది ఫ్రిజ్‌ల(refrigerator)లో రాత్రి మిగిలిన కూరలను దాస్తుంటారు. ఇలా ఫ్రిజ్‌లలో దాచిన(stored) ఆహారం వలన ఆరోగ్యానికి మంచిది కాదని చాలాసార్లు వైద్యులు కూడా చెప్పారు. కానీ సామాన్యులు మాత్రం వినకుండా మాంసంతో చేసిన ఆహారపదార్థలను కూడా నిల్వ చేసుకుని ఉదయం తింటుంటారు. అలా కొన్నిసార్లు పాడైపోయిన మాంసాన్ని తిని అనారోగ్యం బారిన పడుతుంటారు. అచ్చం అలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ అక్కా తమ్ముడు నిల్వ ఉంచిన మాంసహారాన్ని తిని ఏకంగా ప్రాణాలే పొగొట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పల్నాడు జిల్లా(Palnadu District), కారంపుడి మండలం చిన్నగార్లపాడు అనే గ్రామంలో చోటుచేసుకుంది.
అయితే మధ్య యతరగతి కుటుంబాలు మాంసం తెచ్చుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు తెచ్చుకున్న ఫుడ్ మిగిలిపోగా..దాన్ని దాచుకుని తినడం పరిపాటిగా మారిపోయింది. అయితే తెచ్చుకునే మాంసం కూడా తాజాగా కాకుంటే దాన్ని నిల్వ చేస్తే మరింత విష పదార్థంగా తయారవుతుంది. ఏది ఏమైనా నిల్వ ఉంచిన మాంసాన్ని ఇష్టంగా తిన్న ఇద్దరు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్సపొందుతూ వారు మృతి చెందారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.