»Lb Nagar Police Charged The Woman With Third Degree
Third Degree: గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు
పోలీసులు అత్యుత్సాహంతో ఓ మహిళను రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎదురు తిరిగితే ఏదైనా చేస్తామంటూ బెదిరించారు. విషయం తెలుసుకున్న రాచకొండ కమిషనర్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
LB Nagar police charged the woman with third degree
Third Degree: పోలీసుల(Ploice) అత్యుత్సహం కొన్ని సార్లు సామాన్యుల పాలిట శాపంగా మారుతుంది. అభంశుభం తెలియని వ్యక్తులు వారి కోపానికి బలవుతారు. స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) రోజునే ఓ మహిళపై థర్డ్ డిగ్రీ(Third Degree) ప్రయోగించారు ఎల్బీనగర్ పోలీసులు. నడుచుకుంటు వెళ్తున్న మహిళను అనుమానంతో వాహనంలో ఎక్కించుకుని రాత్రంతా పోలీస్‌స్టేషన్(LBNAGAR POLICE STATION)లో ఉంచుకొని చిత్రహింసలకు గురిచేశారు. ఎదురు తిరిగితే తన సంగతి చూస్తామంటు బెదిరించారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఒళ్లంత హూనం చేశారు. మీర్పేట్ పరిధిలోని నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉంటున్న లక్ష్మి, తన కూతురు పెళ్లి కోసం సరూర్‌నగర్‌లోని బంధువులను డబ్బులు అడగడానికి వెళ్లింది. డబ్బులు తీసుకుని ఆగస్టు 15న తిరిగి వస్తుండగా రాత్రి ఎల్బీనగర్ సర్కిల్లో పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి హింసించారు.
విషయం తెలుసుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్(Rachakonda Police Commissioner) డీఎస్ చౌహన్(DS Chauhan) ఈ ఘటనపై విచారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ చౌరస్తాలో సాధారణ ప్రజలను ముగ్గురు మహిళలు ఇబ్బందికర పరిస్థితులకు గురిచేస్తున్నట్లు, వారిలో లక్ష్మి కూడా ఉన్నట్లు తెలిపారు. అందుకని ముగ్గురు మహిళలను 16వ తేదీ తెల్లవారుజామున ఎల్బీనగర్ పీఎస్‌కు తరలించారని, వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి, అనంతరం కోర్టులో హాజరుపరిచారిని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ మహిళ అలాంటిది కాదని, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెపై పోలీసుల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతపై సస్పెన్షన్ వేటు వేశారు.