»Air India Bumper Offer Journey Ticket Rs 1470 Only
Air India: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్..రూ.1,470కే టిక్కెట్
ఎయిర్ ఇండియా(Air India) దేశీయ, అంతర్జాతీయ మార్గాల కోసం నాలుగు రోజుల పాటు స్పెషల్ టిక్కెట్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.1470కే విమానంలో ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే ఈ స్పెషల్ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే ఉంటుందని ప్రయాణికులు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.
Air India Bumper Offer journey Ticket Rs 1470 only
టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా(Air India) దేశీయ, అంతర్జాతీయ రూట్ నెట్‌వర్క్‌లో 96 గంటల ప్రత్యేక విమాన టిక్కెట్ల విక్రయం ఆఫర్లను ప్రకటించింది. అయితే దీనిని గురువారం రోజునే ప్రారంభించింది. ఆగస్టు 20, 2023న ఈ ఆఫర్ 23:59 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాలను ఆకర్షణీయమైన ఛార్జీలతో ప్లాన్ చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు దేశీయ రూట్లలో వన్-వే మార్గంలో ఎకానమీకి రూ.1,470, బిజినెస్ క్లాస్‌కు రూ.10,130 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు. దీంతోపాటు ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాలకు ఆకర్షణీయమైన ఆఫర్ ఛార్జీలు కూడా అందుబాటులో ఉన్నాయని విమానయాన సంస్థ తెలిపింది.
వీటిని ఎయిర్ ఇండియా వెబ్సైట్ (airindia.com). లేదా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. అంతేకాదు కన్వీనియన్స్ ఫీజు లేకుండా అన్ని టిక్కెట్లపై డబుల్ లాయల్టీ బోనస్ పాయింట్లను కూడా పొందవచ్చని తెలిపారు. అయితే ఇవి ఎంపిక చేసుకున్న ప్రయాణికులు(passengers) చేసిన దేశీయ, అంతర్జాతీయ రూట్లలో సెప్టెంబరు 1 నుంచి అక్టోబర్ 31, 2023 మధ్య ప్రయాణించాల్సి ఉంటుందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే ఈ అమ్మకానికి ఉన్న సీట్లు పరిమితంగా ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉన్న సీట్ల మేరకు బుక్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే జూలై నుంచి సెప్టెంబర్ కాలంలో ఇలాంటివి మరికొన్ని ఆఫర్లో వచ్చే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ డైరెక్టర్ జగన్నారాయణ పద్మనాభన్ చెప్పారు. దేశీయ క్యారియర్లకు లీన్ సీజన్, ఇది వేసవి సెలవులు ముగిసిన తర్వాత వస్తాయని అంటున్నారు.