»Wedding With Lavanya Tripathi Cancelled Varun Tej Gave Clarity
Varun Tej: లావణ్య త్రిపాఠితో పెళ్లి క్యాన్సిల్..క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్
గత కొన్ని రోజుల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆగిపోయిందనే రూమర్ వైరల్ అవుతోంది. తాజాగా తమ పెళ్లిపై హీరో వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. గాండీవధారి అర్జున మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తొలిసారి తన ప్రేమ, పెళ్లిపై స్పందిస్తూ పలు విషయాలను పంచుకున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న గాంఢీవధారి అర్జున (Gandeevadhari arjuna) మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen sattaru) తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 25వ తేదిన ఈ మూవీ ప్రేక్షకుల ముందకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో వరుణ్ తేజ్ బిజీ అయిపోయాడు. పలు ఛానెళ్లకు తన ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తున్నాడు.
మూవీ ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను ఆయన చెప్పారు. మొదటిసారిగా తన ప్రేయసి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) గురించి, ఆమె ప్రేమ గురించి తెలిపారు. అలాగే తన పెళ్లి ఎప్పుడు జరగబోయేది కూడా క్లారిటీ ఇచ్చేశారు. గత ఐదేళ్లుగా తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు వరుణ్ చెప్పారు. ముందు ఇద్దరూ ఫ్రెండ్స్‌గా ఉండేవారని, ఆ ప్రయాణంలో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయని, అందుకే మరో అడుగు ముందుకేసి తనే లవ్ ప్రపోజ్ చేసినట్లు తెలిపాడు.
తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబితే ఒప్పుకున్నారని అన్నారు. లావణ్య త్రిపాఠి తనకు చాలా బహుమతులు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఆయన వాడుతున్న ఫోన్ కూడా తనే కొనిచ్చినట్లు చెప్పుకొచ్చారు. తన ఇష్టాలు లావణ్యకి బాగా తెలుసని, ఆమె చాలా మెచ్యూర్డ్, కేరింగ్ పర్సన్ అని తెలిపారు. తమ పెళ్లి కూడా ఎంగేజ్మెంట్ లాగానే చాలా సింపుల్‌గా చేసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో నెట్టింట వీరి పెళ్లిపెటాకులు అయ్యిందనే వార్తలకు జవాబుదొరికినట్లైయ్యింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి.